డిసెంబర్ 4న శ్రేయాస్ ఎటిటి ద్వారా విడుదల కానున్న ‘రాంగ్ గోపాల్ వర్మ’

 •  
 •  
 •  
 •  
 •  
 •  

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన “రాంగ్ గోపాల్ వర్మ” డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ర్యాప్ రాక్ షకీల్ స్వరకల్పనలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ కావడం తెలిసిందే!

షకలక శంకర్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో కత్తి మహేష్, జబర్దస్త్ అభి ముఖ్య పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4 న విడుదల కానుంది!

ఒకప్పుడు దర్శకుడిగా ఒక వెలుగు వెలిగి.. గత కొన్నేళ్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అర్ధ నగ్న, పూర్తి నగ్న చిత్రాలు తీస్తూ.. “సామాజిక కాలుష్యానికి” కారకుడు అవుతున్న ఒక ప్రముఖ దర్శకుడి విపరీత ధోరణిపై నిప్పులు చెరుగుతూ…. జర్నలిస్టు ప్రభు తెరకెక్కించిన “రాంగ్ గోపాల్ వర్మ” చిత్రం ఇప్పటికే అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తుండడం తెలిసిందే. చిత్ర పరిశ్రమతో పాటు, పలువురు సినీ ప్రముఖుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సినిమాలు తీస్తున్న సదరు దర్శకుడి మీదనే ఘాటైన విమర్శనాస్త్రాలు సందిస్తూ ఒక సినిమా వస్తుండటంతో చిత్ర పరిశ్రమలో ఈ సినిమా గురించి ఆసక్తిదాయకమైన చర్చ జరుగుతోంది!!


 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *